IPL 2024 : గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం



చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోకు నిరుటి రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది.


శివమ్‌ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్‌ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్‌ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్‌లో గుజరాత్‌కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్‌ చహర్, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తఫిజుర్‌ తలా 2 వికెట్లు తీశారు.  


207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ను సీఎస్కే బౌలర్లు బెంబేలెత్తించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఆ జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ (8) తొలి వికెట్‌గా వెనుదిరిగినప్పటి నుంచీ ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. వృద్ధిమాన్‌ సాహా (21), సాయి సుదర్శన్‌ (37) కాసేపు నిలబడ్డా.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన గుజరాత్‌ బ్యాటర్లు ఎవరూ కూడా కనీసం పాతిక రన్స్‌ కొట్టలేకపోయారు.


విజయ్ శంకర్ (12), డేవిడ్‌ మిల్లర్‌ (21), రాహుల్‌ తెవాటియా (6), రషీద్‌ ఖాన్ (1) విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకు పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 2, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 2, తుషార్ దేశ్‌పాండే 2, డేరిల్‌ మిచెల్‌ 1, మతీశా పతిరానా 1 వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సీఎస్కే.. టోర్నీలో వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.


స్కోరు వివరాలు 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ :  రుతురాజ్‌ (సి) సాహా (బి) జాన్సన్‌ 46; రచిన్‌ (స్టంప్డ్‌) సాహా (బి) రషీద్‌ ఖాన్‌ 46; రహానే (స్టంప్డ్‌) సాహా (బి) సాయికిషోర్‌ 12; దూబే (సి) శంకర్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 51; మిచెల్‌ (నాటౌట్‌) 24; సమీర్‌ రిజ్వీ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 14; జడేజా (రనౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్‌: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్‌ 2–0–27–0, రషీద్‌ ఖాన్‌ 4–0–49–2, సాయికిషోర్‌ 3–0–28–1, జాన్సన్‌ 4–0–35–1, మోహిత్‌ శర్మ 4–0–36–1. 


గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ :  సాహా (సి) తుషార్‌ (బి) దీపక్‌ 21; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్‌ 8; సాయి సుదర్శన్‌ (సి) సమీర్‌ (బి) పతిరణ 37; విజయ్‌ శంకర్‌ (సి) ధోని (బి) మిచెల్‌ 12; మిల్లర్‌ (సి) రహానే (బి) తుషార్‌ 21; అజ్మతుల్లా (సి) రచిన్‌ (బి) తుషార్‌ 11; తెవాటియా (సి) రచిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 6; రషీద్‌ ఖాన్‌ (సి) రచిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 1; ఉమేశ్‌ (నాటౌట్‌) 10; జాన్సన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–28–2, ముస్తఫిజుర్‌ 4–0–30–2, తుషార్‌ దేశ్‌పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్‌ 2–0–18–1, పతిరణ 4–0–29–1. 

0 Comments

error: Content is protected !!